17 April, 2026 | 10:59 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

అంగన్‌వాడీల్లో ఎగ్‌బిర్యానీ

05-06-2025 12:21 AM

- చిన్నారుల్లో పోషకాహారలోపం లేకుండా జాగ్రత్త వహించాలి

- అంగన్‌వాడీల్లోనూ బడిగంట తరహాలో బెల్స్

- పనిఒత్తిడి తగ్గించేందుకు త్వరలోనే 14వేల ఖాళీల భర్తీ

- మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో మేధోమధన సదస్సులో మంత్రి సీతక్క

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి)/రాజేంద్రనగర్: అంగన్‌వాడీల్లో చిన్నారులకు అందిస్తున్న ఆహారపదార్థాలను మరింత రుచికరంగా మారుస్తున్నామని, వారంలో ఒకటి, రెండుసార్లు ఎగ్‌బిర్యానీ వడ్డించేలా మెనూ మార్చబోతున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకో వాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న విద్య, ఆరోగ్య భద్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీ ణాభివృద్ధి సంస్థలో మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేధోమధన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..అంగన్‌వాడీకేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు నేల మీద కూర్చోడానికి పడుతున్న ఇబ్బందులను తొలగిం చేందుకు బెంచీలను సరఫరా చేస్తున్నామని చెప్పారు. అంగన్‌వాడీ టీచర్లు ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ స్థానంలో అధునాతన మొబైల్స్‌ను త్వరలో అందజేస్తామని ప్రకటించారు.

అంగన్‌వాడీకేంద్రాల్లోనూ బడి గంట తరహాలో బెల్స్‌ను తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నామని, గంట మోగించడం ద్వారా చిన్నారుల్లో ఉత్సాహం, క్రమశిక్షణ పెరగడంతోపాటు టీచర్లు, హెల్పర్లు సకాలంలో వచ్చేందుకు ఉపయోగపడుతుంద న్నారు. ఉద్యోగులు, సిబ్బంది అనుభవాలు, ఆలోచనలు, ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను తెలుసుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని, తమ అభిప్రాయాలను క్రోఢీకరించి నిపుణులు, మేధావులతో చర్చించి అంగన్‌వాడీల సేవలను మరింత మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పనిఒత్తిడిని తగ్గిం చేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కారణంగా నియామకాల ప్రక్రియ కాస్త ఆలస్య మైందని, త్వరలో ఆ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అంగన్‌వాడీలకు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సెల్ఫీ విత్ అంగన్‌వాడీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అంగన్‌వాడీల్లో అడ్మిషన్లు పెంచేందుకు అమ్మమాట అంగన్‌వాడీబాట కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. కొత్తగా నిర్మిస్తున్న అంగన్‌వాడీ భవనాలను ఒకే మోడల్‌లో నిర్మించాలని  సూచించారు.