ఉత్తరాఖండ్‌లో ఘోరప్రమాదం: ఎనిమిది మంది మృతి
23-04-2026 05:23 PM
న్యూ తెహ్రీ: ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand) తెహ్రీ జిల్లాలోని చంబా ప్రాంతంలో గురువారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక యుటిలిటీ పికప్ వాహనం లోతైన లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. ఘన్సాలీలోని థ్యోల్ధార్ గ్రామానికి చెందిన బాధితులు, హరిద్వార్‌లో ఒక గ్రామస్తుడి అంత్యక్రియలు పూర్తిచేసుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, డ్రైవర్ బొలెరో క్యాంపర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని తెహ్రీ జిల్లా మేజిస్ట్రేట్ నితికా ఖండేల్వాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో సుమారు 10 మంది ఉన్నారని, అత్యవసర, సహాయక బృందాలు ఎనిమిది మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి.






