చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి
బాధితులకు రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా
పాట్నా: బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని(Nalanda Stampede) శీతలా మాత ఆలయం( Sheetala Mata Temple) వద్ద జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందారు. మాఘ్రా గ్రామంలోని శీతాలాష్టమి ఆలయానికి భక్తులు పోటెత్తారు. చైత్రమాసం చివరి రోజు కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అంచనాలకు మించి భక్తుల రాకతో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
తొక్కిసలాటలో ఎనిమిది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన భక్తులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ విషాద ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు విపత్తు నిర్వహణ శాఖ నుండి రూ. 4 లక్షలు చొప్పున, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2 లక్షలు చొప్పున (మొత్తం ఒక్కో కుటుంబానికి రూ. 6 లక్షలు) ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన ప్రకటించినట్లు ఒక పత్రికా ప్రకటన తెలిపింది.




