31 March, 2026 | 4:32 PM

టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ BJP లో చేరారు — మమతకు షాక్!

31-03-2026 02:40 PM

కోల్‌కతా: రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, భారత టెన్నిస్ దిగ్గజం లీండర్ పేస్(Tennis Star Leander Paes Joins BJP) మంగళవారంనాడు భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. 2021లో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరిన పేస్, జాతీయ రాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో లాంఛనంగా పార్టీ మారారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.

బెంగాల్ ఎన్నికల(West Bengal Elections) నేపథ్యంలో లియాండర్ పేస్ చేరికతో బీజేపీకి మరింత బలం, మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలినట్లు అయిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రానున్న బెంగాల్ ఎన్నికలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. మమత ప్రభుత్వంపై ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నారు.