రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
03-08-2024 12:20 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్ నియమాకం అయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీ.కె.శ్రీదేవి ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ గా బదిలీ అయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ, రవాణా, ఆర్ అండ్ బీ సంయుక్త కార్యదర్శి ఎస్. హరీశ్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కుమార్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంక, హకా ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి, మార్క్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డి, నియామకం అయ్యారు.




