19 March, 2026 | 2:49 AM

రైతులకు నమ్మకమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి

03-08-2024 01:11 PM

ఖమ్మం మార్కెట్ ఆధునీకరణపై విస్తృత చర్చ

ఉత్తమ విత్తన సంస్థలను ఎంపిక చేసి గుర్తించాలి

హైదరాబాద్: సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, సహకార, చేనేత శాఖల పరిధిలో సంస్థల ఛైర్మన్లు,డైరెక్టర్లు, ఎండీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖమ్మం మార్కెట్ ఆధునీకరణపై విస్తృత చర్చ జరిపారు. వ్యవసాయ, సహకార, చేనేత శాఖల సంస్థల పనితీరుపై దిశానిర్దేశం చేశారు. విత్తనాల లభ్యత, ధృవీకరణపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. రైతులు మార్కెట్ లో అత్యుత్తమ ధరలు పొందడంతో సహాయపడాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. అవసరమైన నిల్వలు అందించడంలో సహాయం చేయాలని మంత్రి తుమ్మల తెలిపారు. రైతులకు నమ్మకమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉత్తమ విత్తన సంస్థలను ఎంపిక చేసి గుర్తించాలని ఆయన ఆదేశించారు.