22 April, 2026 | 2:28 AM

ప్రయాణికుల సాకర్యార్థం ఎనిమిది కొత్త రైళ్లు

22-04-2026 12:48 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం

హైదరాబాద్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం భాగ్యనగరంలోని వివిధ స్టేషన్ల నుంచి 8 కొత్తరైళ్లను ప్రకటించింది. ఈమేరకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ కొత్తరైళ్లు వీక్లీ ట్రైన్స్‌గా ప్రయాణికులకు సేవలందిచనున్నాయి.

హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుచా నూరు (ఆంధ్రప్రదేశ్), శ్రీ గంగానగర్, జైపూర్ (రాజస్థాన్), భువనేశ్వర్ (ఒడిశా)లకు రెగ్యులర్ ట్రైన్స్ నడపాలని డిమాండ్లు వచ్చిన నేప థ్యంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త సర్వీసులను ప్రకటించింది.

ఈ నేపథ్యంలో.. హైదరాబా ద్ నగరంలోని కాచిగూడ, చర్లపల్లి, హైదరా బాద్ (నాంపల్లి) స్టేషన్ల నుంచి ఆయా ప్రాంతాలకు కొత్త రైళ్లను నడపాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి, తిరుచానూరు వంటి పుణ్యక్షేత్రా లకు వెళ్లే భక్తులకోసం 5 రైళ్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. భువనేశ్వర్, జైపూర్, శ్రీగంగా నగర్ వంటి సుదూర ప్రాంతా లకు వెళ్లే ప్రయాణికులకూ లబ్ధి చేకూరనుంది.