ప్రతిపక్షాలు మహిళ అభివృద్ధిని అడ్డుకున్నాయి
విలేకరుల సమావేశంలో ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ప్రతిపక్షాలు మహిళా అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్, సీట్ల పెంపుపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఎలాగైనా మహిళలు ఇదిగో కూడదు అనే సంకల్పంతో ప్రతిపక్ష పార్టీల నేతలు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
2029లో మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ అందించాలనే ఉద్దేశంతో బిల్లు ప్రవేశపెడితే.. కాంగ్రెస్,దాని మిత్ర పక్షాలు వ్యతిరేకించేయని పేర్కొన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ మహిళ రిజర్వేషన్ బిల్లు అడ్డుకుంటూనే వస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడటం.. తర్వాత తూట్లు పొడవటం అనాదిగా కొనసాగిస్తుందన్నారు. మహిళ రిజర్వేషన్ అమలుకు టీఎంసీ, డీఎంకే, ఎస్ పీ, కాంగ్రెస్ కుంటి సాకులు చెబుతూ వ్యతిరేకిస్తున్నారన్నారు.
ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా.. భేదాభిప్రాయం లేకుండా 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదన చేశారన్నారు. 17 స్థానాలు ఉన్న తెలంగాణలో 9 స్థానాలు పెంచితే.. 26 స్థానాలకు పెరిగేవన్నారు. కేంద్రం సమతుల్యమైన ఫార్ములా తీసుకువస్తే.. దేశాన్ని విభజించే తీరుగా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనే భావన ఇండి కూటమి పార్టీలు తీసుకువచ్చారన్నారు. ఈ బిల్లుకు 2/3 మద్దతు కోసం అన్ని పార్టీల మద్దతు పార్లమెంట్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారన్నారు.
ఏప్రిల్ 24వ తేదీన ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు వేడుక కు గాను మహబూబ్ నగర్ కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా విచ్చేస్తున్నారన్నారు. మహిళా బిల్లు వేగిపోతే ప్రతిపక్షాలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని, మహిళకు సముచిత గౌరవం ప్రాథమిక ఇవ్వవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరిచి వారి సంక్షేమం కోసం పరితపిస్తున్నారని విమర్శించారు.
చేయాల్సిన పనులను కూడా పెండింగ్లో పెడుతూ అభివృద్ధిని పూర్తిగా అడ్డుకొని ఇతరులపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం ఉన్నారు. ప్రజలకు మంచి చేసినప్పుడే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు అచ్చుగట్ల అంజయ్య , కిరణ్ కుమార్ రెడ్డి , బొక్క బాల్ రెడ్డి , కృష్ణవర్ధన్ రెడ్డి ,పడకుల సత్యం,మర్రి జ్యోతి ,హరికృష్ణ, కరుణాకర్ రెడ్డి,పద్మావేణి,శివారెడ్డి ,శ్రీశైలం,వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






