28 June, 2026 | 8:10 AM

రూ.1.17 లక్షల కోట్లకు లిస్టెడ్ రియల్టీ కంపెనీల విక్రయాలు

03-06-2024 12:05 AM

ముంబై, జూన్ 2 : స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయిన 18 ప్రధాన రియల్ ఎస్టేట్ కంపెనీలు గత 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.17 లక్షల కోట్ల విలువైన రియల్టీ ఆస్తుల్ని విక్రయించాయి. లిస్టెడ్ రియల్టీ కంపెనీల్లో కొన్ని మినహా, ప్రధాన డెవలపర్లు అందరూ 2022 23తో పోలిస్తే 2023 అధిక సేల్స్ బుకింగ్స్ సాధించారు. ప్రధాన నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు ప్రత్యేకించి లగ్జరీ ఇండ్లకు ఏర్పడిన డిమాండ్ కారణంగా కంపెనీలు అమ్మకాల్ని పెంచుకోగలిగాయి. రెగ్యులేటర్లకు సమర్పించిన సమాచారం ప్రకారం 18 ప్రధాన లిస్టెడ్ రియల్టీ కంపెనీల అమ్మకాలు 2023 ఆర్థిక సంవత్సరంలో 33 శాతం వృద్ధిచెంది రూ.1,16,635 కోట్లకు చేరాయి. అంతక్రితం ఏడాది ఈ కంపెనీలు రూ.88,000 కోట్ల విలువైన ఆస్తుల్ని విక్రయించాయి. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జరిగిన రూ. 1.17 లక్షల కోట్లలో చాలావరకూ ప్రి సేల్స్ బుకింగ్స్ రెసిడెన్షియల్ విభాగం ద్వారా సమకూరిందే. 

గోద్రేజ్ ప్రాపర్టీస్ టాప్

లిస్టెడ్ రియల్టీ కంపెనీల్లోకెల్లా రూ. 22,527 కోట్ల సేల్స్ బుకింగ్స్‌తో గోద్రేజ్ ప్రాపర్టీస్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాన్ని  రూ.21,040 కోట్ల బుకింగ్స్‌తో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రెస్టిజ్ ఎస్టేట్స్ సాధించింది. మార్కెట్ విలువలో అతిపెద్ద కంపెనీ అయిన డీఎల్‌ఎఫ్ రూ.14,778 కోట్ల సేల్స్ బుకింగ్స్ నమోదు చేసింది. లోధా బ్రాండ్‌తో ప్రాపర్టీలను విక్రయించే ముంబైకి చెందిన మాక్రోటెక్ డెవలపర్స్ రూ. 14,520 కోట్ల ప్రి నమో దు చేసింది. గుర్‌గావ్‌కు చెందిన సిగ్నేచర్ గ్లోబల్ రూ.7,270 కోట్లు  బెంగళూరుకు చెందిన శోభా డెవలపర్స్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్‌లు రూ.6,644 కోట్లు, రూ. 6,013 కోట్ల చొప్పున ప్రాపర్టీలను విక్రయించాయి.