సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్లగొండ, జూన్ 11 (విజయక్రాంతి) : ఈనెల 17న సీఎం రేవంత్ రెడ్డి కనగల్ వద్ద 14,500 కోట్ల రూపాయల వ్యయంతో రా ష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న హ్యాం రోడ్ల శం కుస్థాపన చేయనున్న నేపథ్యంలో తగిన ఏ ర్పాట్లు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులు ఆదేశించారు. గురువా రం కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో కలిసి కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఆర్ అండ్ బి సంబంధిత జిల్లా అధికారులతో సీఎం రాక ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు. సీఎం శంకుస్థాపన చేయనున్న హ్యాం రోడ్ల పైలాన్, బహిరంగ సభ నిర్వహించే ప్రదేశం, బహిరంగ సభకు ఏర్పాట్లపై సమావేశంలో చ ర్చించారు.
హ్యాం రోడ్లతోపాటు, మరి కొన్ని పనులకు ఇక్కడ నుంచే శంకుస్థాపనలు నిర్వహించే విషయమై అధికారులతో చర్చించా రు. ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం చేయించి ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని ఆధునికరించేందుకు చర్యలు తీసుకుంటున్నందున అవకాశం ఉంటే దేవాలయ ఆధునికరణ పనులకు కూడా ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద సీఎం తో శంకుస్థాపన చేయించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. శిలాఫలకం, ఇతర ఏర్పాట్లపై సంబంధిత శా ఖ అధికారులు దృష్టి కేంద్రీకరించాలని కొ రారు. హ్యం రోడ్ల శంకుస్థాపన, బహిరంగ సభకు హాజరయ్యే విధంగా ప్రాథమికంగా ఏర్పాట్లు చేసేలా అధికారులకు సూచించా రు.
రాష్ట్ర ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు అధికారులు అందరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పారు. సభకు హాజరయ్యే ప్రజల కోసం టెంట్లు, కుర్చీలు, తాగునీరు, ఇతర వసతులు ఏర్పాటు చేయాలని, ఏర్పాట్లలో ఎక్కడ లోపం లేకుండా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ , జిల్లా అధికారులతో కలిసి కనగల్ వెళ్లి సీఎం బహిరంగ సభకు,హ్యం రోడ్ల శంకుస్థాపన, పైలాన్ ఏర్పాటు చేసే స్థలం , బం దోబస్తుతో సహా పరిశీలించినట్లు వెల్లడించా రు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదన పు కలెక్టర్ అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, డిఈ గణేష్ తదితరులు పాల్గొన్నారు.






