26 March, 2026 | 2:50 AM

వృద్ధ దంపతులపై సుత్తితో దాడి

26-03-2026 12:11 AM

5 తులాల బంగారం దోపిడీ

మెదక్, మార్చి 25 (విజయక్రాంతి): మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం జంగరాయి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం వృద్ధ దంపతులపై దోపిడీ చేసి, 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తి.. వృద్ధ దంపతులు అంజయ్య, సావిత్రి నివాసంలోకి ప్రవేశించి సుత్తితో దాడి చేసి, వారి వద్ద ఉన్న సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యాడు.

గాయపడిన దంపతులను స్థానికు లు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.