24 June, 2026 | 2:35 AM

మా ఇండ్లకు పైసలివ్వండి సార్లూ!

24-06-2026 01:46 AM

ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు ఆలస్యం

  1. ఆఖరి విడత  కోసం ఎదురుచూపులు 
  2. మొదటివిడత లక్షకు పైగా గృహప్రవేశాలు 
  3. అప్పులు చేసి మరీ ఇండ్ల నిర్మాణం
  4. అధికారుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు
  5. గ్రామీణ ప్రాంతాల్లోనే సమస్య అధికం

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఆఖరి విడత బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తయినా కేంద్రం నుంచి రావాల్సిన పీఎంఏవై నిధులు ఆలస్యం కావడంతో జాప్యం జరుగుతోంది. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటంతో లబ్ధిదారులు ఆవేదనకు గురవుతున్నారు. బిల్లులను త్వరగా విడుదల చేయాని కోరుతున్నారు.  

4.50 లక్షల ఇండ్లు మంజూరు..

రాష్ట్రంలో మొదటి విడత 4.50 లక్షల ఇండ్లు మంజూరయ్యాయి. ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారుడికి విడతల వారీగా నాలుగు దఫాల్లో రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తుంది. బేస్మెంట్ లెవల్‌కు రూ.లక్ష, లెంటల్ రూ.లక్ష, స్లాబ్ పూర్తయ్యాక రూ.1.40 లక్షలు, ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయ్యాక మిగతా రూ.1.60 లక్షలు చెల్లిస్తుంది. మూడు విడతల బిల్లులు సకాలంలో అందగా.. ఆఖరి బిల్లు కోసం లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వేలాది మంది లబ్ధిదారులు బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. 

అప్పులు చేసి పూర్తి..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సొంతింటి కల నిజమై, కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన వారికి కూడా సంతోషం లేకుండాపోయింది. కారణం, ప్రభు త్వం నుంచి ఆఖరి విడతగా రావాల్సిన రూ. 1 లక్ష రాకపోవడం. ఇల్లు కట్టుకుం టే రూ. 5 లక్షలు వస్తాయని ఆశపడి, చేతిలో పైసలు లేకపోయినా చాలా మంది అప్పులు తెచ్చి మరీ ఇండ్లు పూర్తిచేశారు. తీరా గృహప్రవేశం అయిపోయాక ఫైనల్ బిల్లు కోసం అధికా రుల చుట్టూ తిరగాల్సి రావడం ఆం దోళన కలిగిస్తోంది. అంతేకాకుండా మూడో విడత బిల్లులో కూడా కేంద్ర వాటాకు సంబంధించిన దాదాపు రూ. 60,000 చాలా మంది అకౌంట్లలో జమ కాలేదని తెలుస్తోంది. 

పల్లెల్లోనే ఎందుకీ జాప్యం?

 ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం అమలులో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. మున్సిపల్ పరిధుల్లో ఆఖరి విడత నిధు లు సాఫీగానే విడుదలవుతుండగా, గ్రామాల్లో మాత్రం నాల్గో వి డత బిల్లుల పంపిణీ పూర్తిగా నత్తనడకన సాగుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ నిధుల కేటాయింపుల్లో ఏర్పడిన ప్రతిష్టంభన. ప్రస్తుతం మంజూరైన 3.68 లక్షల ఇండ్లలో దాదాపు లక్షకు పైగా లబ్ది దారులు ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని నివాసం ఉంటున్నారు.

ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 6 వేల కోట్లకు పైగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. నాలుగో విడత విడదల చేయకపోవడానికి  కేం ద్రం నుంచి రావాల్సిన రూ.2,500 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు రాకపోవడమే కారణమని చెబుతున్నారు. అం దుకే రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ బిల్లును హోల్ట్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ని ధుల విడుదల చేస్తేనే పల్లెల్లో ఇందిరమ్మ ఆఖరి బిల్లుల కష్టాలు తీరనున్నా యి.  అదే మున్సిపాలిటీల్లో  ఆఖరి విడత నిధులు సాఫీగానే విడుదల వుతున్నాయి.