21 March, 2026 | 5:55 PM

తృటిలో తప్పిన ప్రాణాపాయం

21-03-2026 04:08 PM

దమ్మపేట,(విజయక్రాంతి): శనివారం మధ్యాహ్నం మందలపల్లి లోని సొసైటీ కార్యాలయం ఎదురుగా ఒక కారు యూటర్న్ తీసుకుని వెళుతున్న వ్యక్తిని తప్పించబోయి చెట్టును ఢీకొనడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెలితే భద్రాచలానికి చెందిన ఫ్యామిలీ అన్నవరం వెళుతుండగా మందలపల్లి నుండి మోటార్ సైకిల్ పై వస్తూ యూ టర్న్ తీసుకుని మళ్ళీ మందలపల్లి వైపు వెలుచుండగా అటుగా వస్తున్న కారు మోటార్ సైకిల్ ను తప్పించబోయి చెట్టును ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. కారులో ఉన్న నలుగురు సురక్షితం కాగా, మోటార్ సైకిల్ పై వస్తున్న వ్యక్తి కి చిన్న చిన్న గాయాలు కావడంతో సత్తుపల్లి తరలించారు.