14 April, 2026 | 5:04 PM

Breaking News

రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ పలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •  

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

17-12-2025 12:00 AM

డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్

మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 16: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు విడతల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఆదరించడంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందినట్లు తెలిపారు.

మూడో విడత ఎన్నికల్లో కూడా గ్రామాల అభివృద్ధి కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా నిలిచి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎవరి జనాభా ఎంతనో వారికి అంతస్థాయిలో వాటా ఉండాలన్న రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే అమలుచేయలేదన్నారు. పార్టీ పరంగా జనరల్ సీట్లలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ ఆఖ్తర్ మాట్లాడుతూ బీహార్లో ఆయూష్ సర్టిఫికెట్ల పంపిణీలో సీఎం నితిష్ కుమార్ ఓ ముస్లిం మహిళ హిజాబ్ ను తీసివేయడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. సీఎంస్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం సమంజసం కాదని, ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నితీష్ కుమార్ చేసిన చర్యపై దేశంలోని ప్రజాస్వామికవాదులు. మేధావులు తీవ్రంగా ఖండించాలని కోరారు. ఈ సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, నాయకులు సీజే బెనహర్, అజ్మత్ ఆలీ, రాములు యాదవ్, బాలస్వామి, కంచిమి లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, మొయిజ్ తదితరులు పాల్గొన్నారు.