17-12-2025 12:00:00 AM
సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత పెంపు
నాగర్ కర్నూల్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, చారకోండ, లింగాల, పదర, ఉప్పునుతల 7 మండలాలు 158 గ్రామ పంచాయతీలు ఉండగా రిజర్వేషన్ పంచాయతీ కారణంగా అమ్రాబాద్ మండలంలో 5 గ్రామాలకు, చారకొండ మండలంలో డిండి ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన ఒక గ్రామ పంచాయతీకి ఓటర్లు పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మరో 18 గ్రామ పంచాయతీ సర్పంచలు ఏకగ్రీవం అయ్యాయి.
మిగిలిన 134 గ్రామ పంచాయతీలకు గాను 414 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. 1,364 వార్డులకు గాను, అమ్రాబాద్ లో 40 వార్డులకు, చారకొండలో 8 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని, మరో 252 వార్డులు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. మిగిలిన 1,064 వార్డులకు గాను 2,707 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. బుధవారం జరిగే ఎన్నికలకు 1,064 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు.
3,629 పిఓలు, ఓపిఓలతో పాటు 134 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను, 3 వేలకు పైగా పోలీస్ బందోబస్త్ నియమించారు. మండలాల వారీగా ఓటర్లు అచ్చంపేట మండలంలో 38 గ్రామపంచాయతీలు 312 వార్డుల్లో పురు షులు 18,441, మహిళలు 18,516, ఇతరులు..1, మొత్తం ఓటర్లు 36,958 మంది ఉన్నారు. అమ్రాబాద్ మండలంలో 20 గ్రామ పంచాయతీలు,182 వార్డులకు పురుషులు 14,080, మహిళలు 14,663, మొత్తం 28,743 మంది ఓటర్లు ఉన్నారు.
బల్మూర్ మండలంలో 23 గ్రామ పంచాయతీలకు 208 వార్డుల్లో పురుషులు 17,547 మంది, మహిళలు 17,255 మొత్తం ఓటర్లు 34,802 మంది ఉన్నారు. చారకొండ మండలంలో 17 గ్రామ పంచాయతీలు 142 వార్డుల్లో పురుష ఓటర్లు 10,693, మహిళా ఓటర్లు 10,481, ఇతరులు ఇద్దరు చొప్పున మొత్తం. 21,176 మంది ఓటర్లు ఉన్నారు. లింగాల మండలంలో 23 గ్రామపంచాయతీలు,206 వార్డుల్లో పురుషులు 15,554, మహిళలు 15,965, ఇతరులు ఒక్కరి చొప్పున మొత్తం 31,520 మంది ఓటర్లు ఉన్నారు.
పదర మండలంలో 10 గ్రామ పంచాయతీలు, 92 వార్డుల్లో పురుషులు 8,763, మహిళలు 8,599,మొత్తం 17,362 మంది ఓటర్లు ఉన్నారు. ఉప్పునుంతల మండలంలో 27 గ్రామ పంచాయతీలు, 222 వార్డుల్లో పురుషులు 15,171, మహిళలు 15,705, మొత్తం 30,876 మంది ఓటర్లు ఉన్నారు. 3వ విడతలు జరిగే ఎన్నికల్లో పురుషులు1,00, 249మంది, మహిళలు 1,01,184, ఇతరులు 4 మొత్తం 2,01,437 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు.
21 మంది మైక్రో అబ్జర్వర్లతో పాటు 23 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ప్రక్రియను చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వివరిస్తూ, పోటీచేస్తున్న అభ్యర్థులతో ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ తెలిపారు.