03-12-2025 10:07:18 PM
నకిరేకల్ (విజయక్రాంతి): మండలంలోని దుగునెల్లి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లె బోయిన యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ అభ్యర్థులుగా యాదగిరితో పాటు పులకరం రంగయ్య, కొరివి ఎల్లమ్మలు నామినేషన్లు దాఖలు చేయగా బుధవారం ఉపసంహరణ ఉండడంతో రంగయ్య, ఎల్లమ్మలు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో యాదగిరి ఎన్నికల ఏకగ్రీవం అయ్యింది. ఏకగ్రీవ సర్పంచ్ యాదగిరి ని కాంగ్రెస్ నాయకులు పోలిశెట్టి వెంకటేశ్వర్లు వనం రాంబాబు, గదపాటి దానయ్య, వనం బాలకృష్ణ, కృష్ణ కాంత్, గాదనబోయిన రమేష్, వనం రామకృష్ణ, జడుగల ఆంజనేయులు వనం శ్రీనివాసులు కలిసి అభినందించారు.