03-12-2025 10:05:33 PM
నకిరేకల్ (విజయక్రాంతి): మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్ది నాగమణి మల్లేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ అభ్యర్థులుగా పెద్ది నాగమణి, గాధగోని సుజాతలు నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉపసంహరణ ఉండడంతో సుజాత నామినేషన్ ఉపసంహరించుకోవడంతో నాగమణి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. సర్పంచ్ గా నాగమణితో పాటు గ్రామంలో మరో నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రత్యర్ధులు నామినేషన్ ఉపసంహరించుకోవడంతో నాలుగు వార్డులు ఒకే అభ్యర్థి ఉండడంతో ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన అభ్యర్థులను బిఆర్ఎస్ నాయకులు పెద్ది బాలనర్సింహ్మ,పోగుల నర్సింహ్మ మాజీ సర్పంచ్ దాసరి సంజయ్, గాదగోని మురళి, దాసరి కృష్ణ, వెంకన్న లు కలిసి అభినందనలు తెలిపారు.