03-12-2025 10:40:39 PM
కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే స్వగ్రామం పోచారం
గ్రామ పంచాయతీ ఏర్పడిన నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన పాలకవర్గం
ఈసారి ఎస్టీ రిజర్వేషన్
గత చరిత్రనే పునరావృతం అవుతుందా లేక ఎన్నికలు జరిగేనా...?
కామారెడ్డి (విజయక్రాంతి): గ్రామపంచాయతీగా ఏర్పడిన నుంచి ఆ గ్రామంలో గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. గ్రామపంచాయతీ ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటివరకు జరిగిన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఈ గ్రామం పేరు పోచారం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పరిగి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం కావడం విశేషం. ఆ గ్రామానికి ఏ రిజర్వేషన్ వచ్చిన గ్రామస్తులందరూ కలిసి ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకుంటూ వచ్చారు. ప్రస్తుతం బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో టిడిపి, టిఆర్ఎస్, ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్ర రెవిన్యూ మంత్రిగా, స్పీకర్ గా వ్యవహరించారు.
తన గ్రామం పేరే ఇంటిపేరుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటేనే రాష్ట్రంలో గుర్తింపు పొందారు. అలాగే ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ ఏర్పడిన నుంచి జరిగిన సర్పంచ్ ఎన్నికలు గత 40 సంవత్సరాలుగా ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. ఈసారి మూడవ విడతలో సర్పంచ్ ఎన్నికలు ప్రస్తుతం పోచారం గ్రామం ఎస్టి సర్పంచుగా రిజర్వేషన్ ఖరారైంది. ఈసారి కూడా ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ గా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గతoలో లాగా సర్పంచ్, వార్డు సభ్యుల ను ఏకగ్రీవంగానే ఎన్నుకునేందుకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషి చేస్తున్నారు. గ్రామస్తులు పోచారం మాటకు కట్టుబడి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఏక ఎన్నుకుంటారా లేదా వేచి చూడాల్సిందే. కామారెడ్డి జిల్లాలో మాత్రం పోచారం గ్రామానికి ఏకగ్రీవంగా గత 40 సంవత్సరాలుగా గ్రామస్తులు సర్పంచ్ వార్డు సభ్యులను ఎన్నుకున్న చరిత్ర ఉంది. ఈసారి ఆ చరిత్రను పునరావృతం చేస్తారా లేక చరిత్రను తిరగరాస్తారో వేచి చూడాల్సిందే.