ఎన్నికల ప్రచారంలో రగడ
13-12-2025 01:39 AM
- కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు
- పలువురికి గాయాలు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుమ్మడివల్లిలో ఘటన
అశ్వరావుపేట, డిసెంబర్ 12(విజయ క్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికలు గ్రా మాల్లో కొట్లాటకు దారితీస్తున్నాయి. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియో జకవర్గం పరిధి గుమ్మడవల్లిలో శుక్రవారం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య రగడ చెలరేగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరూ పార్టీల కార్యకర్తలు ప్రచారంలో ఎదు రెదురు పడడంతో కొట్లాటకు దారితీసింది. ఇరు పార్టీల వారు ఒకరిపై ఒకరు పిడుగు ద్దులతో దాడి చేయడంతో కొందరు గాయా ల పాలయ్యారు. అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతం కొంతసేపు గందరగోళం చోటుచే సుకుంది.






