13-12-2025 01:34:12 AM
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే రెండు మూ డు రోజులు చలి తీవ్రత మరింత పెరగనుం ది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకా శం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సా ధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ గా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పే ర్కొం ది. శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో శీతలగాలులు వీస్తాయని హెచ్చరించింది.
శని వారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్‌తోపాటు కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ శీతల గాలులు వీస్తాయని తెలిపింది. శుక్రవారం 28 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 5.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 6.0 డిగ్రీలు, కుమ్రం భీం ఆసిఫాబా ద్ గిన్నెధారిలో 6.5 డిగ్రీలు నమోదైంది.