15 April, 2026 | 5:48 AM

తిమ్మాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

13-12-2025 01:40 AM

సర్పంచ్ అభ్యర్థి దుండ్రా రాజయ్య 

తిమ్మాపూర్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): తిమ్మాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశానని, ఇప్పుడు కూడా ప్రజలు ఓటేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తిమ్మాపూర్ సర్పంచ్ అభ్యర్థి దుండ్రా రాజయ్య అన్నారు. తిమ్మాపూర్ సర్పంచ్ బరిలో దుండ్రా రాజయ్య మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. ఫూట్‌బాల్ గుర్తుకు ఓటెయ్యాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు.

గతంలో సర్పంచిగా చేసిన కాలంలో గ్రామాన్ని అభివృద్ధి చేశానని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. రోడ్డు మరమ్మతు, డ్రైనేజీ వ్యవస్థ మరమ్మత్తులు చేయించానని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు అందేలా కృషి తెలిపారు. ఫట్‌బాల్ గుర్తుకు ఓటేసి మరోసారి అవకాశం కల్పిస్తే  పారదర్శకమైన పరిపాలన ప్రజలందరికీ అందిస్తానని చెప్పారు.