29 August, 2026 | 6:39 PM

13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల

10-06-2024 01:20 PM

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. 7 రాష్ట్రాల్లోని 13 స్థానాలకు జులై 10న పోలింగ్ నిర్వహిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) సోమవారం ప్రకటించింది. బెంగాల్ లో 4, హిమాచల్ ప్రదేశ్ లో 3, ఉత్తరాఖండ్ లో 2 స్థానాల్లో, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ లో ఒక్కో స్థానంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ జూన్ 21, ఎన్నికల పత్రాల పరిశీలన జూన్ 24న, నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 26 చివరి తేదీ. జూలై 10న ఉప ఎన్నికలు జరగనుండగా, జూలై 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జూలై 15లోపు ఉప ఎన్నికలను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం పేర్కొంది.