29 August, 2026 | 5:46 PM

అమిత్ షాను కలిసిన ఈటల రాజేందర్

10-06-2024 02:23 PM

న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాను మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేదర్ సోమవారం కలిశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఈటల కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఈటలకు బీజేపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2024 లోక్ సభ ఎన్నిలకలో మల్కాజ్ గిరి ఎంపీగా ఈటల రాజేందర్ ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తీసుకున్నారు. ఈటల కూడా కేంద్ర మంత్రి పదవి ఆశించినట్లు తెలుస్తోంది. బండి సంజయ్, కిషన్ రెడ్డికి మోడీ కేబినెట్ లో చోటు దక్కడంతో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తథ్యమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేసి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.