29 August, 2026 | 7:10 PM

ఘనంగా తెలుగు భాషాదినోత్సవం

29-08-2026 06:34 PM

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గిడుగు వెంకట రామమూర్తి పంతులు జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని శని వారం తెలుగు భాషా దినోత్సవాన్ని తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పత్తి సునీత తెలుగు భాష విశిష్టతను, తెలుగు భాషకు గిడుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన కృషిని వివరించారు.

తెలుగు భాష గొప్పతనాన్ని, అందులోని మాధుర్యాన్ని తెలియజేస్తూ తెలుగు భాషను కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్  ప్రిన్సిపాల్ వహీదా, తెలుగు శాఖ అధ్యాపకులు కె. సరిత, కె. రజిత, విద్యార్థినులు పాల్గొన్నారు.