29 August, 2026 | 7:07 PM

ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లి ఆర్ధికంగా నష్టపోకండి

29-08-2026 06:35 PM

- విద్య, వైద్యానికే ప్రాధాన్యత 

- ప్రతిమ ఫౌండేషన్ ఉచిత అంబులెన్సు సేవలు ప్రారంభం 

- ఆసుపత్రిలో అన్ని రకాల సేవలందేలా కృషి చేస్తున్నాం

- ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెల్లడి 

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ కు వైద్యం కోసం వెళ్లి ఆర్ధికంగా నష్టపోవద్దని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం పట్టణంలోని 30 పడకల ఆసుపత్రి ఆవరణలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని వివరించారు. రాష్ట్రంలోనే మోడల్ హాస్పిటల్ ను లక్షేట్టిపేటలో నిర్మించామన్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వైద్య సేవలు అందించేలా నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను మెరుగైన వైద్యం అందించే ఆసుపత్రికి సురక్షితంగా తరలించేందుకు ఈ వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పేద, సామాన్య ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ప్రజల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్పిస్తుందని తెలిపారు. అనంతరం హాస్పిటల్ ను సందర్శించి, వైద్యులతో మాట్లాడి పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్రతిమ ఇన్స్టిట్యూట్ సీ ఈ ఓ రామచందర్రావు, ప్రతిమ హాస్పిటల్ క్రిటికల్ కేర్ డాక్టర్ ప్రవీణ్, ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్, డాక్టర్ శ్రీనివాస్, జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, లక్షెట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య,తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమీషనర్ విజయ్ కుమార్, వైస్ చైర్మన్ మోత్కూరు రాజేశ్వరి - వెంకట స్వామి గౌడ్,సింగిల్ విండో చైర్మన్ చెల్ల నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, పార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.