29 August, 2026 | 7:33 PM

రియాసిలో ఉగ్ర దాడి చేసింది మేమే

10-06-2024 12:59 PM

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని రియాసిలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆదివారం యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో బస్సు జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో లోతైన లోయలో పడింది. ఆదివారం సాయంత్రం బస్సు రియాసిలోని శివ్ ఖోరి ఆలయం నుంచి కత్రాకు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడికి పాల్పడింది తామేనని లష్కరే తాయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ప్రకటించింది. గత ఐదేళ్లుగా పూంచ్- సెక్టార్ లో  భద్రతా దళాలు- సైన్యం మధ్య కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే.