29 August, 2026 | 7:28 PM

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం

29-08-2026 06:27 PM

ప్రజా సంక్షేమమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం

అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

వీవో సంఘాల భవనాలకు శంకుస్థాపన

గణపురం,ఆగస్టు 29 (విజయ క్రాంతి): ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ప్రజా సంక్షేమమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.గణపు మండలంలో శనివారం పలు గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో పాటు మహిళా వీవో సంఘాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గణపురం మండల కేంద్రంతోపాటు

చెల్పూర్ గ్రామపంచాయతీ ఆవరణలో చెల్పూర్, గొల్లపల్లి గ్రామాల లబ్ధిదారులకు, ధర్మారావుపేటలో బసవరాజు పల్లి, పరశురాంపల్లి, ధర్మారావుపేట, వెంకటేశ్వర్లపల్లి, నగరంపల్లి గ్రామాల లబ్ధిదారులకు, సీతారాంపూర్‌లో కొండాపూర్, సీతారాంపూర్, అప్పయ్య పల్లి గ్రామాల లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అలాగే  బుర్ర కాయలగూడెం, గాంధీనగర్‌లో గాంధీనగర్, మైలారం, లక్ష్మారెడ్డిపల్లి గ్రామాల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

వెంకటేశ్వర్లపల్లి, అప్పయ్య పల్లి గ్రామాల్లో మహిళా వీవో సంఘాల భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

మహిళా సంఘాలను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు వీవో సంఘాల భవనాల నిర్మాణంతో పాటు వడ్డీలేని రుణాలు, ఆర్థిక సహకారం వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమైతే కుటుంబాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అడ్లూరి రాజేశ్వరరావు, లతో పాటు అన్ని గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు