ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలి
కేంద్రాల వద్ద పకడ్భందీ ఏర్పాట్లు
హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (విజయక్రాంతి) : జూన్ 4వ తేదీన జరుగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి, చేపట్టబోయే నిబంధనలను గురించి హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధ్యక్షతన హైదరాబాద్, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారులతో కలి సి గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సంయుక్త సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటో న్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా ఓట్ల లెక్కింపునకు సంబంధించి డీఆర్‌సీ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్ల వివరాల గురించి చర్చించారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడం నిషేధమని, మీడియా పాయింట్ ఏర్పాటు, కౌంటింగ్ ఏజెంట్లకు కల్పించాల్సిన సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించారు.
ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాల్లో పాటించాల్సిన నియమాలను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ అధికారులు, సిబ్బందికి వివరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల బందోబస్తు, బలగాల మోహరింపు అంశాలకు సం బంధించి జోనల్ డీసీఎస్‌పీ, సబ్ నోడల్ ఏసీఎస్‌పీలకు ఇప్పటికే పలు సూచనలు జా రీ చేశామని, కౌంటింగ్ కేంద్రాల వద్ద చేపట్టే భద్రత గురించి సీపీ వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేస్తామన్నారు.






