లే డాడీ.. లే.. ఇంటికి పోదాం..
రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
మృతదేహం పక్కన రెండేండ్ల కుమారుడి రోదన
రోడ్డుపై హృదయ విదారక సంఘటన
అబ్లుల్లాపూర్‌మెట్, 30 మే: అబ్దుల్లాపూర్ మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల కుమారుడిని వెంటబెట్టుకొని రోడ్డుపైకి వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కండ్ల ముందే తండ్రి మృతి చెంది న విషయం తెలియని పసిబాలుడు లే డాడీ.. లే.. ఇంటికి పోదాం.. అంటూ రోదించడం ప్రయణికులతో పాటు పోలీసులను సైతం కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్‌మెట్ మండలం ఇనాంగూడలో నివసిస్తున్న శెట్టి కనకప్రసాద్ (35) ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటు న్నాడు.
గురువారం ఉదయం 7 గంటల సమయంలో పాల ప్యాకెట్, టిఫిన్ కోసమ ని ద్విచక్ర వావానంపై కనకప్రసాద్ కుమారుడు శివకుమార్(2)ను తీసుకొని అబ్దుల్లా పూర్‌మెట్‌కు వెళ్లాడు. తిరిగి బైక్‌పై ఇంటికి వెళ్తూ యూటర్న్ తీసుకుంటుండగా డీసీఎం వాహనం (ఏపీ28టీఏ 5229) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనకప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. డీసీఎం డ్రైవర్ వాహనాన్ని వదలి అక్కడి నుంచి పరారయ్యాడు. మృతుడు కనకప్రసాద్ రాజమండ్రి జిల్లా, కొవ్వూరు మం డలం అతివదుల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతుడి కుంటుబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.






