26 July, 2026 | 5:59 PM

నేడే నార్సింగి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక

31-05-2024 12:17 AM

రాజేంద్రనగర్, మే 30: జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు నేడు నార్సింగి మున్సిపాలిటీ నూతన చైర్మెన్ ఎన్నికను నిర్వహించనున్నారు. మున్సిపల్ కమిషనర్ సమక్షంలో చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. ఇటీవల మాజీ చైర్మెన్ రేఖా యాదగిరిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో మొత్తం 18 కౌన్సిలర్లకు గాను 14 మంది అవిశ్వాసానికి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో శుక్రవా రం నిర్వహించబోయే చైర్మన్ ఎన్నిక పట్ల ఆసక్తి నెలకొంది. నూతన చైర్మన్‌గా మైలా రం శ్రీనివాస్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.