నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపండి
జిల్లాలో ఏ ఒక్క రైతు మోసపోవద్దు
జిల్లా కలెక్టర్ మను చౌదరి
సిద్దిపేట, మే 30 (విజయక్రాంతి): నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపండని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అదేశించారు. గురువారం సిద్దిపేట జిల్లా కార్యాలయంలో పోలీసు, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఏ ఒక్క రైతు కూడా నకిలీ విత్తనాలు కొనుగో లు చేసి మోసపొవద్దని సూచించారు. విత్తన విక్రయ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించాలని అదేశించా రు.
గ్రామాల్లో రైతుల వద్దకే వెళ్లి లేబుల్ లేకుండా, తక్కువ ధరకు విత్తనాలు విక్రయిస్తే వారిపై కేసులు నమోదు చేయలన్నా రు. జిల్లా పోలీసు కమిషనర్ అనురాధ మా ట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి అధికంగా సాగు చేస్తారని చెప్పారు. జిల్లాలో పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో ఆరు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. విత్తన విక్రయ కేంద్రం, గోదాం, స్టోర్ రూంలు ప్రతి చోట పరిశీలించాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో నకిలీ విత్తనాల కేసు నమోదు కాలేదన్నారు.






