సమస్యల పరిష్కార వేదిక నూతన కమిటీ ఎన్నిక
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 20 (విజయ క్రాంతి):తిర్యాణి మండల కేంద్రంలోని కుమ్రం భీం సమావేశ మందిరంలో సోమవారం అఖిలపక్ష సమస్యల పరిష్కార వేదిక (జేఏసీ) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జేఏసీ అధ్యక్షుడిగా మడావి గుణవంతరావు, ఉపాధ్యక్షులుగా చుంచు శ్రీనివాస్ వర్మ, గేడం టీకానంద్, చుంచు శ్రీనివాస్, తాళ్ల శ్రీనివాస్ గౌడ్, మల్యాల అశోక్, ముఖ్య సలహాదారుడిగా మార్క శంకర్ గౌడ్, గౌరవ అధ్యక్షులుగా జువ్యాజీ అనీల్ గౌడ్, కుర్సెంగ మోతిరాం, కార్యదర్శిగా వెడ్మ భగవంతరావు, ప్రధాన కార్యదర్శిగా ముత్యం రాజయ్య, కోశాధికారిగా శంకర్ గౌడ్తో పాటు వంద మందికి పైగా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ మండలంలో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పోరాటం చేస్తామని, ప్రజల తరఫున కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు.అనంతరం కుమ్రం భీం సమావేశ మందిరం నుంచి కుమ్రం భీం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ శ్రీనివాస్కు అందజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






