తుంగతుర్తి లైన్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి లైన్స్ క్లబ్ కమిటీఎన్నికకు ముఖ్యఅతిథిగా హాజరైన లైన్స్ క్లబ్2 వైస్ గవర్నర్ గుడిపూడి వెంకటేశ్వరరావు, పోలవరపు సంతోష్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తల్లాడ కేదారి కార్యదర్శిగా గుండ గాని రాము ట్రెజరీగా ఓరుగంటి శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా పులుసు వెంకటనారాయణ గౌడ్ ఎనగందుల శ్రీను జనరల్ సెక్రెటరీగా ఎనగందులగిరిలను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం వారు ఎన్నికైన సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరు సేవా భావం అలవర్చుకొని, సమాజంలో పేద ప్రజలకు సేవ చేయడమే క్లబ్బు లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి లైన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ చారి డాక్టర్ పప్పుల వెంకన్న వాసు మా అభిలాష్ వంగాల వెంకన్న వీరభైన రాములు యాదవ్ భాస్కర్ ఓరుగంటి సుభాష్ తదితరులు పాల్గొన్నారు






