నోచ్ ల్యాబ్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు
01-05-2026 02:27 PM
9 మంది కార్మికులకు తీవ్ర గాయాలు.
నెల రోజుల వ్యవధిలో రెండో ప్రమాదం.
చిట్యాల, మే 01(విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలోని నోచ్ ల్యాబ్ ఫార్మా కంపెనీలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. నోచ్ ల్యాబ్ ఫార్మా కంపెనీలోని 3వ బ్లాక్‌లోని రియాక్టర్ పేలిపోవడంతో తొమ్మిది మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని కార్మికులు చెబుతున్నారు. గత నెల రోజుల క్రితమే ఇదే ఫార్మా కంపెనీలో ప్రమాదం చోటు చేసుకోగా ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయ గాయపడిన విషయం మరవకముందే మరో ఘటన చోటు చేసుకోవడం కార్మికులను భయాందోళన గురిచేస్తుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు.






