calender_icon.png 1 November, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల సాధన జేఏసీ కార్యవర్గం ఎన్నిక

27-09-2024 07:00:33 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని స్థానిక సంస్థల ఎన్నికల సాధన సమితి సమావేశం శుక్రవారం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ పూర్తి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గుడిగందుల రమేష్, ప్రధాన కార్యదర్శిగా అరుణ్ కుమార్, ఉపాధ్యక్షులు  ఎండి ముజాహిద్, మాయా శ్రీనివాస్ యాదవ్, పెద్ది భార్గవ్, కోశాధికారులుగా రామంచ తిరుపతి, పాలమాకుల భీమ్సేన్ లీగల్ సెల్ సభ్యులుగా కస్తూరి శ్రీనాథ చారి, గుంట రాకేష్,సహాయ కార్యదర్శులుగా భూబత్తుల శ్రీనివాస్, సిద్దని రాజేష్, దేవులపల్లి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులుగా వడ్డేపల్లి సాయికృష్ణ, సోనాల్ శర్మ, సహాయక కార్యదర్శిగా మేసినని నగేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ... ఎన్నికలు సాధించేవరకు పోరాటాల కొనసాగిస్తామని త్వరలో పోరాట కార్యాచరణను ప్రకటించి ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపడతామన్నారు.