తమిళనాట గెలుపెవరిదో?
తమిళనాడు అంటే మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయల లిత మాత్రమే మనకు మొదట గుర్తుకొస్తారు. తమిళనాట ఎన్నికలు ఎప్పుడు వచ్చి నా అక్కడి ప్రజలు అభ్యర్థిని చూసేవారు కాదు. వీరిని మాత్రమే చూసి ఓట్లు వేసేవారు. ఇప్పుడు హేమాహేమీలైన వారిద్ద రూ లేరు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోవడం తమిళులకు కష్టమే. కానీ, వాస్తవాన్ని అంగీకరించి ముందుకు సాగక తప్పదు. ఈ ఇద్దరు ఉద్దండులు లేకుండా 2021లో తొలిసారిగా తమిళనాడులో ఎన్నికలు జరిగాయి.
ఆ సమయంలో ఏదో అద్భుతం జరుగుతుందని, ఎవరో గెలుస్తారని గోబె ల్స్ ప్రచారం ముమ్మరంగా జరిగింది. జయలలిత మరణించిన తర్వాత నుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలను దగ్గరుండి చూసిన ద్రవిడ ప్రజలు తెలివిక లవారు కదా? అందుకే 159 స్థానాల్లో 45.3 శాతం ఓట్ షేరింగ్‌తో నిర్ణయాత్మకంగా ఓటర్లు డీఎంకేకు పట్టం కట్టారు. స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు కేంద్రంలోని మోదీ ప్రభు త్వం కక్షగట్టి అధికార దాహంతో గవర్నర్ సాయంతో ఆ రాష్ట్రంలో పాలనకు అడ్డుపుల్లలు వేసింది.
తద్వారా ప్రజల్లో వ్యతిరేకత పెరిగే విధంగా వ్యవహరించింది. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగనున్న ది. అయితే, రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటినుంచీ ఎన్నికల వేడి రాజుకుందని చెప్పాలి. రాజకీయ పార్టీల నేతలు చేసే హడావిడి అంతాఇంతా కాదు. అధికారం కోసం అన్ని పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. సామాజికవర్గా ల వారీగా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నా యి. అధికార డీఎంకే కూటమి తమ పీఠా న్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉండగా, ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే అధికారా న్ని తిరిగి దక్కించుకోవాలని తహతహలాడుతున్నది.
అయితే దక్షిణాదిన కీలకమైన రాష్ట్రం తమిళనాడులో పాగా వేయాలని ఎప్పటినుంచో కలలుగంటున్న బీజేపీ ఎన్నికల ముందు మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అంశాన్ని లేవనెత్తి భంగపడ్డది. తమిళనాట సనాతన, హిందుత్వ నినాదంతో ఆ పార్టీ ముందుకుసాగుతుండగా, ప్రాంతీయ, ద్రవిడ అస్తిత్వమే ప్రధా న భూమికగా ఇతర పార్టీలు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి.
1960లలో ద్రవిడ రాజకీయాల ఆవిర్భావం నుంచి తమిళనాడు రాజకీయాలు బలమైన సామ్యవాద స్వభావాన్ని కలిగి ఉన్నాయి. తమిళనాడులో ద్రవిడ అస్తిత్వ మూలాలున్న ఏఐడీఎంకే, డీఎంకే పార్టీలను మాత్రమే అక్కడి ప్రజలు పట్టం కడు తూ వస్తున్నారు. గత కొంతకాలం వరకు మూడవ పార్టీ ఉనికి కూడా లేదు. ఈ రెండు పార్టీలు మాత్రమే కుల ఆధారిత పార్టీలుగా చలామణి అయ్యాయి. అణగారిన వర్గాల కోసం ఆందోళన చేసిన దాఖ లాలు లేవు. ఏ పార్టీ అయినా కుల ఆధారిత కూటమికి మొగ్గుచూపితే ప్రజలు ఆదరించలేదు.
2001లో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ప్రభు త్వం ఓటుబ్యాంక్ కొల్లగొట్టాలని కులాలతో కూటమి కట్టి ఘోరంగా ఓడిపోయింది. ఉత్తర తమిళనాట వన్నియర్లు, ముదలియార్లు ద్రవిడ ఉద్యమానికి అండగా నిలి చారు. 1980 తర్వాత పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) వన్నియార్ ఓటుబ్యాంకు ను చీల్చింది. డీఎంకే బలం అంతా కూడా 15 శాతం ఉన్న క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలే. అలాగని తమిళులు ఒకే పార్టీకి పట్టం కట్టలేదు. ఎన్నికల్లో తరచుగా ప్రాంతాలు, ఆయా కులాలు ఏకరీతి ఫలితాలు ఇచ్చినప్పటికీ, అధికారంలో ఉన్న పార్టీలకు ఝల క్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంజీ రామచంద్రన్, జయలలిత, కరుణానిధి ముఖ్యమం త్రులుగా రాణించినప్పటికీ 2018లో కమలహాసన్ రాజకీయ అరంగేట్రం చేసినా ఆయనకు ఆదరణ దక్కలేదు. 2020లో రాజకీయాల్లోకి రావాలనుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కరోనా కాలంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వెనక్కి తగ్గారు. ఇప్పుడు తమిళనాట మరో నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరిట రాజకీయ పార్టీని స్థాపించి, 2026 ఎన్నికల బరిలో నిలిచారు.
తమిళనాట నెల రోజులపాటు హోరాహోరీగా జరిగిన ప్రచారంలో రెండు కూట ముల నుంచి రాజకీయ ఉద్దండులు రోడ్ షో, కార్నర్ షోలు ఇంటింటికి ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. రాష్ట్రంలో 5.73 కోట్ల ఓటర్లు ఉండగా, మొత్తం 234 నియోజకవర్గాలకుగాను 4,023 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ భవితవ్యాన్ని తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు.
ప్రధానంగా డీఎంకే, ఏఐడీఎంకే మధ్యలో పోటీ ఉన్నది. ద్రవిడనాట జాతీయ పార్టీ లు వీటికి తోక పార్టీలుగా వ్యవహరిస్తుండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సొంతం గా పోటీ చేసే బలం లేక డీఎంకేతో కాంగ్రె స్, అన్నాడీఎంకేతో బీజేపీ అంటకాగుతున్నాయి. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు కేం ద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయి నా, గతంలో కేంద్రాన్ని శాసించిన కాంగ్రెస్ అయినా సరే, ఈ రాష్ట్రంలో కనీసం 10 శాతం ఓట్లను కొల్లగొట్టిన దాఖలాలు చరిత్రలో లేవు.
సినీ కెరటం విజయ్ చీల్చే ఓట్లతో అధికార పార్టీ ఓటుబ్యాంకుకు గండిపడి, తమకు మేలు జరుగుతుందని బీజేపీ దింపుడుకల్లం ఆశతో ఉన్నది. టీవీకే అధినేత విజయ్ అన్ని స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపి రెండు కూటములకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలకు ఎరవేసి, నయానో భయానో అధికారం పంచుకునే బీజేపీ ఆటలు ఇక్కడ సాగడం లేదు. యువతలో క్రేజ్ ఉన్న విజయ్‌తో పొత్తు కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అయితే ‘లౌకిక ప్రగతిశీల కూట మి’లోని డీఎంకే, కాంగ్రెస్, వీసీకే, డీఎండీకే, సీపీఐ, సీపీఐ (ఎం), ఎండీఎంకే తది తర ప్రాంతీయ పార్టీల మధ్య మొదటినుంచీ సయోధ్య ఉంది.
సీట్ల సర్దుబాటు ఒకింత సామరస్యంగా జరిగింది. ఎన్డీయే కూటమిలో ఏఐడీఎంకే, బీజేపీ, పీఎంకే, ఏఎంఎంకే పార్టీలు ఉండగా, వీటి మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో కొంత అసంతృప్తి నెలకొన్నది. అధికార పార్టీ డీఎంకే అధినేత స్టాలిన్ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ కాకుండా ముందునుంచి జాగ్రత్తపడ్డా రు. ముఖ్యమంత్రి స్టాలిన్ తనదైన శైలిలో జవాబుదారీతనంతో వ్యవహరించడం డీఎంకేకు కలిసివచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ అస్తిత్వ భావోద్వేగాల మధ్య మోదీ వర్సెస్ స్టాలిన్‌గా ఈ పోరు మారితే ద్రవిడ జనం ఎటువైపు మళ్లుతారనేది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
2016లో జయలలిత తప్ప వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని నిలబెట్టుకున్న చరిత్ర ఎవరికి లేదు. కరుణానిధికి ఇది సాధ్యం కాలేదు. కానీ, తన తండ్రి సాధించలేని విజయాన్ని స్టాలిన్ ముద్దాడుతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2021 లో అన్నాడీఎంకే కూటమి గెలిచిన 75 స్థానాల్లో 41 పశ్చిమ ప్రాంతంలోని పళనిస్వామి కంచుకోట నుంచే ఉన్నాయి. గత ఎన్నికల్లో దక్షిణ తమిళనాడు ప్రాంతంలో అన్నాడీఎంకే భారీగా దెబ్బతింది. ఆ పార్టీకి ఏడు చోట్ల డిపాజిట్ రాలేదు. వాటిలో నాలుగు నియోజకవర్గాలు దక్షిణాది ప్రాం తానివే కావడం గమనార్హం. మహిళా రిజర్వేషన్ల ప్రభావం మోదీకి పెద్దగా కలిసిరాకపోవ చ్చని తెలుస్తున్నది. స్టాలిన్‌ను గద్దె దించాలన్నంత వ్యతిరేకత ద్రవిడ సమాజంలో లేదు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయ్ ప్రచారం చేసినంత మాత్రాన టీవీకేకి ఓట్లు పడటం అంత సులభం కాదు. ఓబీసీల రిజర్వేషన్లు 69 శాతం అనుభవిస్తున్న తమిళ సమాజం బీజేపీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టే పనిలో పడ్డది. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీల కోటాపై మాట్లాడకపోవడం, డీలిమిటేషన్ లో దక్షిణాదిపై వివక్ష, బీజేపీకి ఆదరణ తెచ్చిపెట్టిన అన్నామలైని అర్ధాంతరంగా తొలగించడం లాంటి అంశాలు బీజేపీకి ఇబ్బందిగా మారవచ్చు. ఓబీసీల వాటా తేల్చకుండా తెచ్చిన రిజర్వేషన్ ‘బిల్’ మూలంగా బీజేపీ మూల్యం చెల్లించక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మోదీ ప్రభుత్వం ఇప్పటికే బీజేపీయేతర ప్రభుత్వాలకు నిధుల కేటాయింపుల్లో వివక్ష, నియోజకవర్గాల పునర్వి భజనలో ప్రాతినిధ్య తగ్గింపు, త్రిభాష సూత్రం, రాష్ట్రంలో గవర్నర్ల పెత్తనం లాంటి అంశాలను చాపకింది నీరులా ప్రజల్లోకి తీసుకవెళ్లిన స్టాలిన్ గెలుపు నల్లేరుమీద నడకేనని భావిస్తున్నారు.
వ్యాసకర్త సెల్: 9866255355
ప్రొ.సంగని మల్లేశ్వర్






