6 May, 2026 | 2:37 AM

ఎలక్టోరల్ బాండ్లకు ఈసీ వ్యతిరేకం

26-05-2024 12:05 AM

(నిన్నటి సంచిక తరువాయి)

కేంద్రం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌ను  వ్యతిరేకిస్తూ ప్రతివాదులలో ఒకరైన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) 2019 మార్చి 25న సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పొలిటికల్ ఫైనాన్స్‌లో పారదర్శకత లక్ష్యానికి ఈ పథకం విరుద్ధమని అఫిడవిట్ పేర్కొంది. 2017 మే 26న ఈసీఐ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖను పంపించింది. రాజకీయ ఆర్థిక/నిధుల పారదర్శకతపై పరిణామాలు/ప్రభావానికి వ్యతిరేకంగా హెచ్చరించినట్లు కూడా పేర్కొంది. అంతేకాకుండా, విరాళాలకు సంబంధించిన వివరాలను పంచుకోవడం నుంచి రాజకీయ పార్టీలను మినహాయించడం విదేశీ నిధుల సమాచారాన్ని చీకటిలో ఉంచుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది. భార తదేశంలోని రాజకీయ పార్టీల విదేశీ నిధులను తనిఖీ చేయలేదు, ఇది భారతీయ విధానాలను విదేశీ కంపెనీలు ప్రభావితం చేయడమేనని అఫిడవిట్‌లో  పేర్కొంది.

2019 ఏప్రిల్1న, కేంద్ర ప్రభుత్వం ఈబీఎస్ ‘రాజకీయ నిధులలో పారదర్శకత,  జవాబుదారీతనం స్ఫూర్తిని కొనసా గించడానికి ఎన్నికల సంస్కరణలను తీసుకురావడంలో ఒక మార్గదర్శక చర్య’ అని పేర్కొంటూ ఒక వివరణ (రిజాయిండర్)ను సమర్పించింది. రాజకీయ పార్టీలు ఎక్కువగా నగదు విరాళాల ద్వారా నిధు లు పొందాయని, ఇది ‘నల్లధనం నియంత్రణ లేని ప్రవాహానికి’ దారితీసిందని కేం  ద్రం పేర్కొంది. అటువంటి బాండ్లను జారీ చేయగల అధికారం ఒకే ఒక అధీకృత బ్యాంక్ -స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు -ఉన్నందున ఈ సమస్యలు ఇకపై రాజకీయ నిధులకు ఆటంకం కలిగించవని కేంద్రం హామీ ఇచ్చింది. ఇంకా, కేవైసీ వివరాలను అందించడం జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుందని అన్నారు. 

సుప్రీంకోర్టులో సవాలు

2019 ఏప్రిల్ 12న, చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో, జస్టిస్‌లు దీపక్ గుప్తా,  సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం అన్ని రాజకీయ పార్టీలను విరాళా లు, దాతలు,  బ్యాంక్ ఖాతా నంబర్ల వివరాలను సీల్ కవర్లో ఈసీఐకి సమర్పిం చాలని ఆదేశించింది. ఇటువంటి బరువైన సమస్యలపై లోతైన విచారణ అవసరం అని పేర్కొంటూ పథకం అమలుపై స్టే విధించడాన్ని బెంచ్ మానుకుంది.ఈ క్రమంలో పిటిషనర్లు పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. బిహార్ ఎన్నికలకు ముం దు 2019 నవంబర్‌లో, ఆపై 2020 అక్టోబర్‌లో  అత్యవసర విచారణ కోసం దర ఖాస్తు దాఖలు చేశారు. 2021 ప్రారంభంలో, బాండ్ విక్రయాల  తాజా రౌండ్ ప్రారంభించడానికి ముందు, స్కీమ్‌పై స్టే విధించాలని కోరు తూ ఏడీఆర్ కోర్టును ఆశ్రయించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలో  న్యాయమూర్తులు ఎఎస్ బోప న్న, వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఈ దరఖాస్తును గణనీయంగా పరిగణించింది.  2021మార్చి 26న పథ కం దరఖాస్తుపై స్టే ఇవ్వడానికి బెంచ్ తిరస్కరించింది.

విదేశీ కార్పొరేట్ సంస్థలు బాండ్లను కొనుగోలు చేసి దేశంలో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించవచ్చనే భయం అనవసరమని అభిప్రాయపడింది.  పిటిషనర్లు కోర్టును ఆశ్రయించకుండా బెంచ్ నిరుత్సాహపరిచింది, ఒకే ఉపశమనం కోరుతూ పదేపదే దరఖాస్తులు ఉండకూడదని పేర్కొంది. 2023 అక్టోబర్16 న, పిటిషనర్లు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేసును విచారించేందుకు ప్రస్తావన సమయంలో కోర్టును ఆశ్రయించారు. దాన్ని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసింది.2023 అక్టోబర్ 31 న, సిజెఐ చంద్రచూడ్ నేతృత్వంలో న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మూడు రోజుల పా టు వాదనలు వినింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం కార్పొరేట్ నిధులు, నల్లధనం చెలామణి, అవినీతిని పెంచిందని పిటిషనర్లు వాదించారు. రాజకీయ పార్టీల విధా నాలు, అభిప్రాయాలను తెలియజేస్తున్నందున, రాజకీయ పార్టీల నిధుల మూలా నికి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు ఓటర్లకు ఉందని వారు వాదించారు.

నిధులు ఇవ్వని రాజకీయ పార్టీల నుండి ప్రతీకారం తీర్చుకునే దాతల గోప్యత మరియు గోప్యత హక్కుకు హామీ ఇవ్వడానికి ఈ పథకం రూపొందించామని కేంద్రం వాదించింది.  2023 నవం బర్2న రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. 15 ఫిబ్రవరి 2024న, యూనియన్ యొక్క 2018 ఎలక్టోరల్ బాండ్స్ (ఈబీ) పథకాన్ని కోర్టు ఏకగ్రీవంగా కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టి కల్ 19(1)(ఎ)లో పొందుపరిచిన ఓటర్ల సమాచార హక్కును ఈ పథకం ఉల్లంఘించిందని బెంచ్ పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్ల విక్రయాన్ని తక్షణమే నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. 12 ఏప్రిల్ 2019 నుండి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీఐకి సమర్పించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఇందులో కొనుగోలుదారుతో పాటు బాండ్లు ఇచ్చిన రాజకీయ పార్టీల వివరాలు ఉంటాయి. అంతేకాకుండా, సమా చారం అందినప్పటి నుండి ఒక వారంలోగా (13 మార్చి 2024 నాటికి) ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పంచుకున్న సమాచారాన్ని ప్రచురించాలని కోర్టు ఈసీఐని ఆదేశించింది. 21 మార్చ్ కల్లా మొత్తం వివరాలు ఇచ్చారు. కేవలం సమాచారం కోసమే ఇంత పోరాటమా? అవి లంచా లా కాదా? లంచాలయితే ఏం చేస్తారు? ఇది అసలైన ప్రశ్న. 

ఎందుకిదంతా?

ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎస్‌బీఐ దాచిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోం దంటూ వచ్చిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం లోతుగా విచారించింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించిన ఎస్‌బీఐ, ఆ బాండ్స్ నెంబర్లను అందజేయకపోవడంపై ధర్మాసనం ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్లకు చెందిన నెంబర్లను ఎన్నికల సంఘానికి అందజేయాలని కూడా ఆదేశించింది. నెంబర్లు వెల్లడించకపోవడంవల్ల, ఏ కంపె నీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందో తెలియలేదని ధర్మాసనం పేర్కొంది. కీలకమైన ఆల్ఫా న్యూమరిక్ నెంబరును వెల్లడిస్తే, ఆ నెంబర్‌తో ఆ విరాళాలు ఎక్కడికి వెళ్లాయో తెలుస్తాయి కదా. కేసు విచారణ ప్రారం భం కాగానే, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్రచూడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా తరపున ఎవరు వాదనలు వినిపిస్తున్నారు? వారు బాండ్ నంబర్లను వెల్లడిం చలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి ని వెల్లడించాలి అని అడిగారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకొని ‘నేను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తర పున వాదనలు వినిపించడం లేదు.

మీరు ఎస్‌బీఐకి నోటీసు జారీ చేయవచ్చు. ఎందుకంటే ఇందుకు సంబంధించి ఏదై నా చెప్పవలసింది వారే అని భావిస్తున్నా ను’ అని చెప్పారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఎస్‌బీఐ తమ వద్ద అందుబాటులో ఉన్న అన్ని వివరాలను అందించేలా చూడాలని కోరారు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ప్రకారం ఎస్‌బీఐ ఎలక్టోరల్ బాం డ్లకు సంబంధించిన అన్ని వివరాలను ఈసీకి అందించాలి. కొనుగోలు చేసిన తేదీ, కొనుగోలుదారు పేరు సహా రిడీమ్ చేయాలి  కాకపోతే ఆ వివరాలను ఎస్‌బీఐ వెల్లడించలేదు. ఎలక్టోరల్ బాండ్ల ప్రత్యేక ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లను వెల్లడించాలి అని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం దరఖాస్తును ధర్మాసనం కొట్టివేసింది. ఈసీఐ సీల్డ్ కవర్‌లో గతంలో ఇచ్చిన వివరాలను స్కాన్ చేసి డిజిటలైజ్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అంతేకాదు.. ఈసీఐ సీల్డ్ కవర్‌లో ఇచ్చిన వివ రాలను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో శనివారం సాయంత్రం 5 గం టల కల్లా ఉంచాలని స్పష్టం చేసింది. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ వివరాలను ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. 13న బాండ్ల వివ రాలను ఈసీకి ఎస్‌బీఐ అందించగా, 15న సాయంత్రం 5 గంటల్లోగా ఈ వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది కోట్ల రూపాయల వ్యవహారానికి సంబంధించింది. 2019 ఏప్రిల్ 12 నుంచి 2024 జనవరి 24 మధ్య కాలంలో వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఎస్‌బీఐ విక్రయించిన బాండ్ల వివరాలు ఇందులో ఉన్నాయి. రెండు భాగా లుగా బాండ్ల వివరాలను వెల్లడించింది. ఒక భాగంలో ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన దాతలు, సంస్థల వివరాలు ఉన్నాయి. రెండో భాగంలో ఈ బాండ్ల ద్వారా నిధులు పొందిన రాజకీయ పార్టీల వివరాలను వెల్లడించింది.

విశిష్టమైన బ్యాంక్ ఇలా చేస్తుందా?

భారతదేశంలో స్టేట్ బ్యాంక్ అంటే చాలా గొప్ప చరిత్ర కలిగిన బ్యాంక్. కానీ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ మారిపోయింది.  ఎన్నికల బాండ్ల్ల వివరాలు ఇవ్వడానికి జనవరి 30వ తేదీ వరకు గడువు ఇవ్వాలని ఎస్‌బీఐ అడిగింది అంటే ఎన్నికలు పూర్తి గా అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో  తెలిశాక కావ లసినంత గడువు ఇస్తారన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. 

 (చివరి భాగం మంగళవారం సంచికలో)

ఇది అధికార రహస్యమా? 

లంచం మహానుభావులు గురించి వివరాలు చెప్పదట, రహస్యాలు చెప్పరట, అన్నీ గోప్యంగా ఉండాలట, ఎవరికీ వివరాలు చెప్పవద్దట.  ఇప్పుడు కొత్తగా మనకు కనపడే అందమైన లంచాల వివరాలు ఎన్నికల సంఘానికి  ఇవ్వాలి కదా, సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, ఎస్‌బీఐ కూడా  ఒప్పుకున్నది కదా! అయినా పూర్తి సమాచారం ఇవ్వకుండా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇవి లంచాలకే పరువు దీయవచ్చు. అవి విరాళాలు. అది కూడా దేశం కోసం, దేవుడు కోసం. లంచాలకు, పెద్దలకు డబ్బు సంపాదించిన వారికి ఇతరులకి వారితో పాటు ప్రభుత్వానికి ఈ మధ్య అనేక అనేక సంబంధాలు ఉంటాయి. ప్రభుత్వానికి వ్యాపారులకి కూడా చాలా సంబంధాలు ఉంటాయనే ఈ రహస్యాలు? 

- మాడభూషి శ్రీధర్