6 May, 2026 | 3:58 AM

మన వ్యోమగాములకు ‘నాసా’ శిక్షణ

26-05-2024 12:05 AM

గగన్‌యాన్‌లో భాగంగా త్వరలో అంతర్జ్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి వెళ్లే భారతీయ వ్యోమ గాములకు అమెరికా అంతరిక్ష పరిశోధా కేంద్రం నాసా అత్య ధునాతన శిక్షణను త్వరలో ఇవ్వనుంది. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో లేదా త్వరలోనే ఈ శిక్షణా కర్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు. భారత్ తొలి సారిగా వ్యోమగాములను అంతరిక్ష కేంద్రంలోకి పం పేందుకు యత్నిస్తున్న తరుణంలో ఇప్పటికే ఈ విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న నాసా మన వ్యోమ గాములకు శిక్షణ ఇవ్వనుండడం ఎంతగానో తోడ్పడుతుంది. అమెరికా అధ్య క్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ సమయంలో అంతరిక్ష పరిశోధనల్లో రెండు దేశాలు సహకరిం చుకోవడానికి సంబంధించి ఒక ఒప్పం దం కుదిరింది. అవపరమైతే రెండు దేశాలు సంయుక్తంగా ప్రయోగాలు నిర్వహించాలని కూడా ఆ సమయంలో నిర్ణయించారు.

ఈ ఒప్పందంలో భాగంగానే మన వ్యోమగా ములకు నాసా అత్యాధునిక శిక్షణను ఇవ్వనున్నట్లు గార్సెట్టి చెప్పారు. అంతేకాకుండా త్వరలోనే శ్రీహరికోటలోని ఇస్రోకు చెందిన సతీష్ ధావన్  అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి  ‘నిసార్’  ఉపగ్రహాన్ని రెండు దేశాలు కలిసి ప్రయోగించనున్నట్లు కూడా ఆయన తెలిపారు.పర్యా వరణ వ్యవస్థలు, భూ ఉపరితలం, సహజ ప్రమాదాలు, సముద్రమట్టం పెరుగుదల, క్రియోస్పియర్ సహా అన్ని వనరులను పరిరక్షించడం కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. అంతరిక్షాన్ని శాంతి ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి, అలా గే ‘ఆర్టెమిస్’ లాంటి ఒప్పందాల అమలులో  భారత్, అమెరికాలు చేయి చేయి, భుజం, భుజం కలిపి ఎలా ముం దుకు సాగనున్నాయో త్వరలోనే అందరూ చూడనున్నట్లు గార్సెట్టి ప్రకటించారు. 

కాగా ఈ సదస్సులో పాల్గొ న్న ఇస్రో చైర్మన్  డాక్టర్ సోమనాథ్, ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించిన రెండు దేశాల నేతలకు సెల్యూట్ చేస్తున్నానని ప్రకటించడం ద్వారా ఈ రంగంలో భారత్, అమెరికాల సహకారం ఎంత ముఖ్యమైందో  స్పష్టం చేశారు.ఈ రంగంవల్ల దేశంలో జరగబోయే అభివృద్ధి, ఉద్యోగాల కల్పన చాలా ఎక్కువే ఉంటుందని, స్టార్టప్‌లద్వారా ఇవి కల్పించబడతాయని  గార్సెట్టి వివరించారు.  బెంగళూరులో జరిగిన సదస్సులో రెండు దేశాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు  పాల్గొన్నారు. కీలక రంగాల్లో ముఖ్యంగా రోదసీ రంగంలో రెండు దేశాల మధ్య బంధం బలోపేతం కావడంలో ఈ సదస్సు తొలి అడుగని కార్యక్రమంలో ప్రసంగించిన అందరూ అభిప్రాయపడ్డం గమనార్హం.