8 June, 2026 | 9:12 PM

ఈదురు గాలులతో విరిగిన విద్యుత్ స్తంభాలు

08-06-2026 07:59 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలంలోని   ధానోరా(బి ), మల్లాపూర్ తదితర గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం 7:30 గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో  వర్షం కురవడంతో  విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరగడంతో పాటు  చెట్లు సైతం నేలకొరిగాయి. సాయంకాలం విద్యుత్ సరఫరా లో అంతరాయం జరిగింది. విద్యుత్ స్తంభాలు  పడిపోయిన విషయం తెలియగానే  విద్యుత్ శాఖ  ఎస్ ఈ రాథోడ్ శేషారావు తోపాటు  విద్యుత్ శాఖ  అధికారులు గిరిజన గ్రామాలు పరిశీలించి అప్పటికప్పుడే విరిగిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త విద్యుత్ స్తంభాలను  ఏర్పాటు చేసే విద్యుత్ సరఫరా చేశారు.