4 June, 2026 | 2:29 AM

బీసీ వెల్ఫేర్ శాఖను రద్దు చేస్తారా?

04-06-2026 12:51 AM
  1. ఈ శాఖలో ఉన్నతాధికారులలో శాఖల్లో బీసీలు నిల్
  2. బీసీ శాఖలలో బీసీలనే  నియమించాలి
  3. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): బీసీ సంక్షేమ శాఖలో బీసీలు నిల్, బీసీ సంక్షేమ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టు రెండు సంవత్సరాలుగా పూర్తిస్థాయి అధికారులు నియమించలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ఇన్చార్జిలతో నడుపుతున్నారని, ఒక్క బీసీని నియమించలేదని పేర్కొన్నారు. బీసీ వెల్ఫేర్ కమిషనర్ నాన్ బీసీకి చెందిన బాల మాయ దేవిని నియమించారని, ఆమె మొత్తం బీసీ ఉద్యోగులను వేధిస్తుందని ఆరోపించారు.

నాన్ బీసీ అధికారులకే పెత్తనం ఇస్తుందని,  బీసీ రెసిడెన్షియల్ సొసైటీ సెక్రటరీగా నాన్ బీసీకి ఇచ్చారని, బీసీ కార్పొరేషన్ ఎండిగా నాన్ బీసీ కి ఇచ్చారన్నారు. ఇలా మొత్తం బీసీ సంక్షేమ శాఖలో పెద్ద పోస్టులు అన్ని బీసీ వ్యతిరేక అధికారులతో నింపి బీసీ శాఖను బ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ బీసీ వెల్ఫేర్ శాఖలో బ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా బీసీల అభివృద్ధి పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే బీసీ సంక్షేమ శాఖలో ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్,  ఎండి తదితర  పోస్టులు ఉన్నతాధికారులను బీసీలనే నియమించాలని డిమాండ్ చేశారు.  లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమించవలసి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగె మల్లేష్ యాదవ్,  రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్,  బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి.  అనంతయ్య, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.  రాజేందర్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్,  బీసీ హాస్టల్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లగొర్ల మోడీ రాందేవ్,  ఓయూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నిఖిల్ పటేల్, శివకుమార్ యాదవ్, భీమ్ రాజు, అంజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.