28 June, 2026 | 3:44 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విద్యుత్ షాక్

22-10-2024 12:32 PM

నలుగురు విద్యార్థులకు గాయాలు 

మెదక్ (విజయక్రాంతి): విద్యుత్ షాక్ తగిలి నలుగురు విద్యార్థినులకు గాయాలైన ఘటన హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతి రావ్ పూలే గురుకుల పాఠశాలలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. జిల్లా స్థాయి గురుకుల క్రీడా పోటీలకు గురుకుల పాఠశాల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ ఫ్లాగ్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఇనుప రాడ్ విద్యుత్ తీగలకు తాకింది. దీంతో రాడ్ పట్టుకున్న రజిత, వసంత, అనుష్క, గాయత్రిల చేతులకు షాక్ కొట్టింది. దీంతో వెంటనే వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చేతులకు గాయాలైనట్లు తెలిపారు. రజిత ఇంటర్ చదువుతుండగా మిగతా విద్యార్థినిలు పదో తరగతి చదువుతున్నారు. పరామర్శించిన మెదక్ ఆర్డీవో రమాదేవి.. విద్యుత్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, ప్రమాదంపై అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.