25 April, 2026 | 7:23 PM

ఎండల తీవ్రత దృష్ట్యా

25-04-2026 06:03 PM

విద్యుత్ వినియోగదారులు

ఆన్ లైన్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు

విద్యుత్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్ 

కామారెడ్డి,(విజయక్రాంతి): విద్యుత్ వినియోదారులు విద్యుత్ బిల్లులను ఆన్లైన్ ద్వారా చెల్లించే సౌకర్యం కల్పించినట్లు విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ సాల్య నాయక్ తెలిపారు.  రోజు రోజుకు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలో వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా చెల్లించడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. కామారెడ్డి విద్యుత్ శాఖ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్  తెలిపారు. వినియోగదారుల సౌలభ్యం కోసం నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్  డిజిటల్ చెల్లింపుల విధానాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు.

పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులు: ప్రతి ఏటా 10 శాతం విద్యుత్ వినియోగదారులు తమ నెలవారీ బిల్లులను టీజీ ఎన్పీడీసీఎల్ ,యాప్, టి. వ్యాలెట్, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చెల్లిస్తున్నారని తెలిపారు. 

గణాంకాలను పరిశీలిస్తే:

2024- 25 ఆర్థిక సంవత్సరం లో 9,30,833 మంది వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేయగా.. 2025- 26 ఆర్థిక సంవత్సరం లో 9,42,944 మంది వినియోగదారులు డిజిటల్ విధానం ద్వారా చెల్లింపులు చేసారని తెలిపారు. వేసవి తీవ్రత - ఇంటి వద్దే ఉండండి.. సురక్షితంగా చెల్లించండి!ప్రస్తుతం ఎండల తీవ్రత  అధికంగా ఉన్నందున, వినియోగదారులు బిల్లుల చెల్లింపు కోసం బయటకు వచ్చి ఎండ దెబ్బకు గురికావద్దని ఎస్‌.ఈ విజ్ఞప్తి చేశారు.

"వేసవి తాపం దృష్ట్యా వినియోగదారులు విద్యుత్ కార్యాలయాల వద్ద ఉన్న కౌంటర్లకు రావాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే ఉండి, సురక్షితంగా ఆన్ లైన్ పద్ధతుల ద్వారా బిల్లులు చెల్లించి ఎండల నుంచి రక్షణ పొందండి" అని ఆయన సూచించారు.

ఆన్ లైన్ చెల్లింపుల ప్రయోజనాలు:

సౌలభ్యం: కార్యాలయ కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా చెల్లింపు చేయవచ్చు.

సమయ ఆదా: కేవలం రెండు నిమిషాల్లో ఆలస్యం లేకుండా చెల్లించవచ్చు.

తక్షణ ధృవీకరణ: లావాదేవీ తక్షణమే నమోదవుతుంది.

సమాచారం: ప్రతి నెల విద్యుత్ బిల్లుల వివరాలు నేరుగా వినియోగదారుని మొబైల్‌కు అందుతాయి.

పారదర్శకత: అకౌంటింగ్ వ్యవస్థ పారదర్శకంగా, సురక్షితంగా ఉంటుంది.

చెల్లింపు విధానం:

విద్యుత్ వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లోని ప్లే స్టోర్ లో TGNPDCL అని టైప్ చేసి యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో విద్యుత్ బిల్లుపై ఉన్న యుఎస్సి  నంబర్ నమోదు చేసుకొని ప్రతి నెల బిల్లులను సులభంగా చెల్లించవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రతి నెల చెల్లించవలసిన మొత్తంపై ముందస్తు సమాచారం  అందుతుందని ఆయన స్పష్టం చేశారు.వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా, సేవలను సులభతరం చేయడం, ఆధునీకరించడం దిశగా టీజీఎన్‌పీడీసీఎల్ నిరంతరం కృషి చేస్తుందని సూపెరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్ తెలిపారు.