15 July, 2026 | 4:42 PM

Breaking News

కంచర్లకు అదనపు ఆర్టీసీ బస్సు ట్రిప్పు మంజూరు   •   93,101,104 BLO బ్లాక్ లను సందర్శించిన మాజీ జెడ్పిటిసి   •   క్రమశిక్షణ ఐక్యతకు నీడలు ఉపకరిస్తాయి: సిఐ డి.గురుస్వామి   •   టీజీవీపీ భిక్కనూర్ మండల కళాశాల కమిటీల నియామకం   •   కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు, ప్రయాణికులు క్షేమం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   యోగాతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్   •   కల్తీ డీఏపీ ఎరువుల దందా బట్టబయలు   •   ప్రతి విద్యార్థి పాఠశాలలో రాగి జావా తీసుకునే విధంగా చూడండి   •  

కంచర్లకు అదనపు ఆర్టీసీ బస్సు ట్రిప్పు మంజూరు

15-07-2026 04:42 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామానికి అదనపు ఆర్టీసీ బస్సు ట్రిప్పు మంజూరు చేసినందుకు గ్రామ ప్రజాప్రతినిధులు డిపో మేనేజర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని వినతిపత్రం సమర్పించగా, వెంటనే సానుకూలంగా స్పందించి ట్రిప్పు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోల్ల అరుణస్వామి మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఎన్నో రోజుల డిమాండ్ నెరవేరిందని, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలకు ఈ అదనపు బస్సు ట్రిప్పు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజల సమస్యను గుర్తించి వెంటనే స్పందించిన ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆశా రమేష్, వార్డు సభ్యుడు రజనీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.