2 May, 2026 | 11:09 PM

విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించిన విద్యుత్ శాఖ అధికారులు

02-05-2026 09:51 PM

నార్సింగి,చేగుంట,(విజయక్రాంతి)ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా విద్యుత్ భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని నార్సింగి మండల విద్యుత్ శాఖ విభాగ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహాయ విభాగ అధికారి ఆదెయ్య, విభాగ ఇంజనీర్ స్వామి అధ్యక్షత వహించగా, లైన్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు,  గ్రామానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగం లో పాటించాల్సిన భద్రతా నియమాలు, అప్రమత్తత చర్యలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరంగా అవగాహన కల్పించారు. అలాగే విద్యుత్ పరికరాలను సురక్షితంగా ఉపయోగించడం, పొలాలలో విద్యుత్ సంబంధిత పనులు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే స్పందించే విధానాలపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజల్లో విద్యుత్ భద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యమని అధికారులు తెలిపారు.