16 April, 2026 | 2:45 AM

యువత ప్రాణాలు అమూల్యం.. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి

16-04-2026 01:12 AM
  1. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం

శాతవాహన యూనివర్సిటీలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన సదస్సు

కరీంనగర్ క్రైం, ఏప్రిల్ 15(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక శాతవాహన యూనివర్సిటీలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ, మున్సిపల్, మరియు రవాణా శాఖల సమ న్వయంతో నిర్వహిస్తున్న

ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల 3వ రోజు కార్యక్రమానికి జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ నెల 13 నుండి 18 వరకు కమిషనరేట్ వ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం యువతే ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరమని, దీనిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ అలవాటు చేసుకోవాలని సూచించారు.

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యు. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ, తమ విద్యాలయ ప్రాంగణం డ్రగ్ ఫ్రీగా ఉందని, ర్యాగింగ్ నిరోధానికి ప్రత్యేక కమిటీ పనిచేస్తోందని తెలిపారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు క్యాంపస్ అంతటా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కొత్తపల్లి స్టేషన్ అధికారి (ట్రైనీ ఐపీఎస్) సోహం సునీల్, ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, రిజిస్ట్రార్ సతీష్ కుమార్ పాల్గొన్నారు.