calender_icon.png 13 November, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలన

13-11-2025 12:00:00 AM

 కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, నవంబర్ 12 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఖమ్మం జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు అర్హత పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సైనిక్ స్కూల్ అర్హత పరిశీలనలో భాగంగా వెలుగుమట్ల లోని శ్రీ చైతన్య విస్టా పాఠశాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పిపిపి) మోడ్ లో 100 సైనిక్ స్కూల్ లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ఖమ్మం నగరం వెలుగుమట్ల లోని శ్రీ చైతన్య విస్టా పాఠశాల సైనిక్ స్కూల్ క్రింద దరఖాస్తు చేసుకోగా, బుధవారం క్షేత్ర స్థాయిలో పాఠశాలను పరిశీలించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హత పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ఎస్‌ఎస్ శాస్త్రి, జిల్లా విద్యా శాఖ అధికారి చైతన్య జైని, విద్యా శాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్ సి.హెచ్. రామకృష్ణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.