calender_icon.png 13 November, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం

13-11-2025 12:00:00 AM

విద్యార్థుల ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 12 (విజయ క్రాంతి):పేద విద్యార్థులకు మెరుగైన విద్య, అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతా లక్ష్యంగా పని చేస్తున్నామని, విద్యార్థుల ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.బుధవారం వేములవాడ మండలం లోని మహాత్మ జ్యోతిబాపూలే గరల్స్ స్కూల్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కుల గురించి, విద్య యొక్క ప్రాముఖ్యత, బాల్య వివాహాల గురించి అవగాహన కల్పించారు..

ఈ కార్యక్రమనీకి రాష్ట్రప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ రాష్ట్ర బాలలహక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ శ్రీమతి మర్రిపల్లి చందన తో కలిసి పాల్గొన్నారు.మాట్లాడుతూ తల్లిదండ్రులు ముఖ్యంగా ఆడపిల్లలను కచ్చితంగా చదివిపించాలన్నారు..ఎవరిని కూడా పనులకు పంపించకూడదు అని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సహాయ సహకారాలూ అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అలాగే అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు అని తెలిపారు.

విద్య పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రాముఖ్యత, పేదలు చదువుకునే పాఠశాలలు ,కళాశాలలు , రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్ పేర్కొన్నారు.రెసిడెన్షియల్ విద్యార్థులు చదువుకునే పేద పిల్లల కోసం ప్రజా ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీల పెంచామని అన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని లక్ష్యంతో కామన్ డైట్ మేన్యూ ప్రవేశ పెట్టామని అన్నారు.నూతనంగా 11 వేల టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో నియమించామని అన్నారు.

ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలు పదోన్నతులు పారదర్శకంగా చేశామని అన్నారు. విద్యా వ్య వస్థలో సమూల మార్పులు తీసుకుని వస్తున్నామని, ఐటిఐ కళాశాలను రతన్ టాటా కంపెనీతో అనుసంధానం చేసుకొని అడ్వాన్స్ ట్రేడ్ సెంటర్లుగా మారుస్తున్నామని అన్నారు. 200 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 20 నుంచి 25 ఎకరాల స్థలంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణ పనులు ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, ఏసిడిపిఓ సుచరిత కేజీబీవీ కోఆర్డినేటర్ పద్మజ, సూపర్వైజర్ శంకరమ్మ, ఎల్సిపిఓ అంజయ్య మరియు కేజీబీవీ ప్రిన్సిపల్ పాఠశాల సిబ్బంది ఐసిపిఎస్ చైల్ లైన్ సిబ్బంది, తదితరులు పాల్గొనడం జరిగింది..