13-11-2025 12:00:00 AM
రాజరాజేశ్వర స్వామి ఆలయ పనులను అకస్మికంగా తనికి చేసిన: రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 12 (విజయ క్రాంతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక చొరవతో నిధులను మంజూరు చేస్తున్నారు.150 కోట్లతో ఆలయ అభివృద్ధి పట్టణ అభివృద్ధి శరవేయంగా జరుగుతుంది. శృంగేరి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధిశేఖర భారతి స్వామివారి అనుమతులతో ముందుకు పోతున్నాం.
ఇటీవల స్వామి వారి స్వయంగా వచ్చి రాజన్న ఆలయంలో పరిశీలన జరిపి పలు సూచనలు సలహాలు చేశారు.వచ్చే భక్తులకు అర్జిత సేవల కోసం భీమేశ్వర ఆలయంలో తగు ఏర్పాట్లు చేయడం జరిగింది.స్వామివారి కళ్యాణం కోడే కుంకుమ పూజ సత్యనారాయణ వ్రతం అన్ని రకాల ఆర్జిత సేవలకు భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఆలయం ముందర రావి చెట్టు వద్ద భక్తులకు దర్శనం కోసం ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రజల భక్తుల మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ అభివృద్ధి.అన్నీ వర్గాల సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నాం.రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే రాజన్న భక్తులు ఆలయ అభివృద్ధికి సహకరించాలి.. వేములవాడ పట్టణ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రాజన్న భక్తులు రాజన్న ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్న..