17 April, 2026 | 10:29 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నవోదయ ఫలితాల్లో ఎలైట్ క్రియేటివ్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

28-03-2025 12:00 AM

కోదాడ, మార్చి 27: ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కోదాడ ఎలైట్ క్రియేటివ్ స్కూల్ విద్యార్థిని షేక్ జాస్మిన్ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆరవ తరగతిలో ప్రవేశానికై అర్హత సాధించింది. కాగా గురువారం పాఠశాల ఆవరణలో సీటు సాధించిన విద్యార్థితోపాటు తల్లిదండ్రుల ను అభినందిస్తూ పాఠశాల ప్రిన్సిపాల్ కోటి సీతాలక్ష్మి, డైరెక్టర్ వేదంతరావు ఉపాధ్యాయనిలు ఘనంగా సన్మానించారు.

గతంలో కూడా కోదాడలోని తమ పాఠశాలలు శ్రీ స్కూల్, ఎలైట్ క్రియేటివ్ స్కూల్ నుంచి ఎంతోమంది విద్యార్థులు నవోదయ, సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకై సీట్లు సాధించారని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు