15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వార్షికోత్సవంలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

24-02-2026 01:06 AM

గాంధారి, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి  3వ వార్షికోత్సవ మహోత్సవంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ రావు సోమవారం పాల్గొన్నారు. గాంధారి మండల కేంద్రంలో నిర్వహించినటువంటి ఈ పవిత్ర వేడుకకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే  స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వాదాలు స్వీకరించి, ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ బుర్రకథ కార్యక్రమాన్ని వీక్షించి కళాకారులను అభినందించారు. భక్తుల సమక్షంలో జరిగిన ఈ ఉత్సవం భక్తి భావనతో నిండి, గాంధారి పట్టణంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.